Roja: ఇదేనా.. 40ఇయర్స్ ఇండస్ట్రీ..? నారా బ్రహ్మణికి రోజా కౌంటర్‌..

Minister Roja Strong Counter to Brahmani
x

Roja: ఇదేనా.. 40ఇయర్స్ ఇండస్ట్రీ..? నారా బ్రహ్మణికి రోజా కౌంటర్‌..

Highlights

Roja: చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా.

Roja: చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఊదరగొట్టడం, మా కన్నా తోపులు లేరని పచ్చ ఛానల్లో పబ్లిసిటీ వేసుకోవడం తప్ప పేద ప్రజల కోసం, వారి ఆరోగ్యం కోసం ఏనాడైనా ఆలోచించారా అని రోజా ధ్వజమెత్తారు. రాష్ట్రం విడిపోయి కష్టాల్లో ఉందని చంద్రబాబుకు అధికారాన్ని కట్టబెడితే.. 5 ఎండ్లలో ప్రజల డబ్బుని దోచుకున్నారని ఫైర్ అయ్యారు.

స్కిల్ స్కాంలో సాక్షాలతో సహా దొరికి జైల్లో కూర్చుంటే.. సిగ్గు లేకుండా చంద్రబాబు భార్య, కోడలు గంటలు కొట్టండి, జగన్ మోహన్ రెడ్డికి బుద్ది చెప్పండి అంటూ మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. ఈ రాష్ట్రంలో పెద్ద సైకోలు ఎవరైనా ఉన్నారు అంటే అది మీ నాన్న బాలకృష్ణ, మీ మామ చంద్రబాబు అంటూ.. బ్రహ్మణికి కౌంటర్ ఇచ్చారు రోజా.

Show Full Article
Print Article
Next Story
More Stories