Roja: మహాత్మా గాంధీ గురించి అందరూ గొప్పగా మాట్లాడేవారే కానీ.. గాంధీ చెప్పింది ఫాలో అయ్యింది మాత్రం సీఎం జగనే

Roja: చిత్తూరు జిల్లా నేసనూరులో వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా

Jyothi
Published on: 16 Nov 2023 12:19 PM IST
Minister Roja Participated in Why AP Needs Jagan Program in Nesanur of Chittoor District
X

Roja: మహాత్మా గాంధీ గురించి అందరూ గొప్పగా మాట్లాడేవారే కానీ.. గాంధీ చెప్పింది ఫాలో అయ్యింది మాత్రం సీఎం జగనే

Roja: మహాత్మాగాంధీ గురించి చాలా గొప్పగా మాట్లాడేవారే కానీ.. గాంధీ చెప్పింది ఫాలో అయ్యింది మాత్రం సీఎం జగన్‌ మాత్రమేనని అన్నారు మంత్రి రోజా. గ్రామస్వరాజ్యం ద్వారానే అందరికీ న్యాయం జరుగుతుందని గాంధీ భావించారని, సీఎం జగన్‌ దానిని ఆచరణలో పెట్టారన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి.. లబ్దిదారులకు పథకాలు అందజేస్తున్నారని చెప్పారు రోజా.

చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని నేసనూరు సచివాలయ పరిధిలో వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయ ప్రాంగణంలో నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని డిస్ప్లే బోర్దుల ద్వారా వివరించారు. గ్రామంలో మా నమ్మకం నువ్వే జగనన్న పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు మంత్రి రోజా.

Jyothi

Jyothi

Next Story