Roja: జోరు వానలో సెల్పీలు దిగుతూ ఎంజాయ్ చేసిన మంత్రి రోజా

Roja: వైరలవుతున్న మంత్రి ఆర్.కే.రోజా ఎంజాయ్‌ వీడియో

Jyothi
Published on: 6 Dec 2023 8:13 AM IST
Minister Roja Enjoyed Taking Selfies in the Heavy Rain
X

Roja: జోరు వానలో సెల్పీలు దిగుతూ ఎంజాయ్ చేసిన మంత్రి రోజా

Roja: మిచౌంగ్ తుఫాన్‌ ప్రభావంతో నియోజకవర్గం ప్రజలు ముప్పుతిప్పలు పడుతుంటే ఆ మంత్రి మాత్రం జోరు వానలో రీల్స్ చేసుకుంటూ వివాదంలో చిక్కుకున్నారు. నిత్యం ఏదోక వివాదంలో తలదూర్చే రోజా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సింది పోయి "చినుకు చినుక అందెలతో చిటపట‌ చిరు సవ్వడితో అంటూ జోరు వానలో చిందులు వేసిన వీడియోలు వెలుగు చూసాయి. ప్రస్తుతం ఈ వీడియోలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

జోరును కురిసే వర్షంలో పుత్తూరు మున్సిపాలిటీ పిళ్లారిపట్టు సచివాలయం పరిధిలోని తాయిమాంబాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంత్రి రోజా నిర్వహించారు. జోరున కురిసే వర్షంలో అవ్వ తాతలు, అక్క చెల్లెలతో ఆప్యాయంగా పలకరిస్తూ వార్డులలో పర్యటించారు. గ్రామ ప్రజలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మంత్రి రోజాకు ఘన స్వాగతం పలికి ఆహ్వానించారు. గడప‌ గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రీల్స్ చేయడం స్థానికుల్లో‌ ఉత్సహాం వచ్చినప్పటికీ ఓ‌ ప్రజాప్రతినిధి అయ్యుండి ప్రభుత్వ కార్యాక్రమంలో రీల్స్ చేయడం ఏంటని‌ ప్రశ్నిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story