Roja: మహిళా డ్రైవర్లతో ఫోటోలు దిగి.. ఆటో నడిపిన రోజా

Roja: దీన్ని బట్టే చంద్రబాబు, లోకేష్ లు తప్పు చేశారని అర్ధం అవుతుంది

Shekhar G
Published on: 30 Sept 2023 7:57 AM IST
Minister Roja Drive Auto
X

Roja: మహిళా డ్రైవర్లతో ఫోటోలు దిగి.. ఆటో నడిపిన రోజా

Roja: చంద్రబాబు, లోకేష్ లు ప్రజల సొమ్ము దోచుకున్నారన్నారు ఏపీ మంత్రి రోజా. శుక్రవారం వైఎస్సార్ వాహనమిత్ర కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న రోజా.. చంద్రబాబు, లోకేష్‌లపై ఫైరయ్యారు. తప్పు చేసిన వారికి ఎక్కడికైనా వెళ్లి నోటీసులు ఇవ్వొచ్చన్నారు. ఇప్పటివరకూ ఏ స్కాం జరగనట్టు మాట్లాడిన లోకేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఎందుకు ఆశ్రయించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీన్ని బట్టే చంద్రబాబు, లోకేష్ లు తప్పు చేశారని అర్ధం అవుతుందని ఆరోపించారు రోజా. ఇక ఏపీ మంత్రి రోజా ఆటో డ్రైవర్ అవతారంలో సందడి చేశారు. ఖాకీ చొక్కా ధరించి మహిళా ఆటో డ్రైవర్స్ తో సరదాగా సెల్ఫీలు దిగారు. వారితో పాటు కాసేపు మంత్రి రోజా కూడా ఆటో నడిపి ఆకట్టుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story