మంత్రి రోజా సెల్ ఫోన్ లభ్యం.. మూడు బృందాల గాలింపు..

Minister Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఫోన్ దొరికింది. రోజా సెల్ ఫోన్ చోరీ కావడంతో అధికారులు, పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు.

Arun Chilukuri
Published on: 21 April 2022 5:05 PM IST
Minister Roja Cell Phone Available
X

మంత్రి రోజా సెల్ ఫోన్ లభ్యం.. మూడు బృందాల గాలింపు..

Minister Roja: ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా ఫోన్ దొరికింది. రోజా సెల్ ఫోన్ చోరీ కావడంతో అధికారులు, పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. దొంగను గుర్తించేందుకు ఏకంగా మూడు బృందాలు గాలింపులు చేపట్టాయి. మంత్రి ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్రాంతాలను జల్లెడ పట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. చివరగా ఎస్వీ యూనివర్శిటీ సెనేట్ హాల్‌లో సెల్ ఫోన్ గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. సెల్ ఫోన్ దొంగలించలేదు మరచిపోయి పొగొట్టుకున్నారని తిరిగి అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.

మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు రోజా. అనంతరం పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్న తరువాత పద్మావతి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన శాప్ మీటింగ్‌కు హాజరైన తర్వాత సెల్ ఫోన్ మిస్ అయినట్లు గుర్తించారు మంత్రి రోజా. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పద్మావతి గెస్ట్ హౌస్, ఎస్వీ వర్సిటీ సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎస్వీ వర్సిటీ సెనేట్ హాల్‌లో ఫోన్‌ను గుర్తించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story