RK Roja: ఆ ఘనత చంద్రబాబుదే.. టీడీపీ వాళ్లంతా కలిసినా కొడాలి నాని గెడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరు..

RK Roja: నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని ఏపీ మంత్రి రోజా విమర్శించారు.

Arun Chilukuri
Updated on: 15 Sept 2022 3:04 PM IST
Minister RK Roja Sensational Comments on Chandrababu
X

RK Roja: ఆ ఘనత చంద్రబాబుదే.. కొడాలి నాని మాట్లాడిన వాటిలో తప్పేముంది..

RK Roja: నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని ఏపీ మంత్రి రోజా విమర్శించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం.. పది నిమిషాల వాయిదా సమయంలో ఆమె అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయమై మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ పెద్ద మోసం చేసిందని విమర్శించారు మంత్రి ఆర్కే రోజా. అమరావతి కావాలా? మూడు ప్రాంతాలు కావాలా అని ప్రజలను టీడీపీ నేతలు అడగాలన్నారు.

రాంగ్ రూట్ లో ఎమ్మెల్సీ అయిన నారా లోకేశ్ సీఎం జగన్ పై అవాకులు, చెవాకులు పేలుతున్నారని... తీరు మార్చుకోకపోతే ప్రజలతో బుద్ధి చెప్పిస్తామని హెచ్చరించారు. కొడాలి నాని భాషలో తప్పేముందని ప్రశ్నించారు. కొడాలి నానిపై ఈగ వాలినా సహించబోమని అన్నారు. టీడీపీ వాళ్లంతా కలిసినా కొడాలి నాని గెడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story