అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటన

అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటన
x

అన్నమయ్య జిల్లా రాయచోటిలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పర్యటన

Highlights

రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అన్నారు.

రాయచోటి అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరుగుతున్న రింగ్‌రోడ్డు పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఏడున్నర కోట్ల రూపాయల నిధులతో మదనపల్లి రింగ్‌రోడ్డు నుంచి పీలేరు రింగ్‌రోడ్డు సర్కిల్ వరకు నాలుగు లైన్‌ల రహదారిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రానున్న 6 నెలల్లో పనులు పూర్తి చేసి రోడ్డును వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. స్థానికులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రహదారులను, డ్రైనేజీని నిర్మిస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories