Perni Nani: చంద్రబాబు పైశాచికానందం పొందుతున్నారు

Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 25 Jun 2021 6:02 PM IST
Minister Perni Nani Slams Chandrababu On Tenth Inter Exams Cancel
X

పేర్ని నాని(ఫైల్ ఇమేజ్ )

Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పరీక్షలు రద్దయితే చంద్రబాబు పైశాచికానందం పొందుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. పిల్లల భవిష్యత్‌ను రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని పేర్ని నాని విమర్శించారు. భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశం వైసీపీ ప్రభుత్వానికి లేదన్న మంత్రి సుప్రీం ఆదేశాలతోనే పరీక్షలు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.

సోమవారం నుంచి జర్నలిస్టులకు అక్రిడేషన్స్

సోమవారం నుంచీ ఆన్‌లైన్‌లో అక్రిడేషన్ ప్రక్రియ తీరిగి ప్రారంభం అవుతుందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. కోర్టులో కొందరు పిటిషన్లు వేయడం వల్లనే అక్రిడేషన్ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. మొత్తం 40వేల 402మంది అక్రిడేషన్ కోసం నమోదు చేసుకున్నారని, 32వేల 314మందిలో 17వేల 149మంది ఆర్జీలను అధికారులు పరిశీలించినట్లు మంత్రి తెలిపారు. వీటిలో 6వేల 714 అప్లికేషన్లు డిఫర్ అయినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకూ 20వేల 610మందికి అక్రిడేషన్లు ఇచ్చామన్న మంత్రి వీలైనంత త్వరగా మిగిలిన వారికి అక్రిడేషన్లు ఇస్తామని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story