Perni Nani - KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని సెటైర్లు

Perni Nani - KCR: ఏపీలో కాదు తెలంగాణలోనే రాజకీయ శూన్యత: పేర్ని నాని

Sandeep Eggoju
Updated on: 29 Oct 2021 5:41 PM IST
Minister Perni Nani Satires on CM KCR
X
సీఎం కేసీఆర్ పై పేర్నినాని సెటైర్లు (ఫైల్ ఇమేజ్)

Perni Nani - KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి హాట్‌కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి పేర్ని నాని. నదీ జలాల విషయంలో కేసీఆర్ మాట తప్పారన్నారు. దిండి, పాలమూరు లాంటి ప్రాజెక్టుల్లో తాగునీరు పేరుతో సాగుకు నీళ్లు మళ్లించారన్నారు. ఇదే సమయంలో కేసీఆర్ ఏపీలో పార్టీ కామెంట్‌పై హైదరాబాద్‌కు విజయవాడ ఎంతదూరమో విజయవాడకు హైదరాబాద్ అంతే దూరమన్నారు. రాజకీయ శూన్యత వల్లే తెలంగాణలో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయన్న పేర్ని 151 సీట్లు వచ్చిన ఏపీలో శూన్యత ఎక్కడుందని ప్రశ్నించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story