సీఎం జగన్‌తో మంత్రి పేర్నినాని సమావేశం

రేపు మ.3 గంటలకు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

Rama Rao
Updated on: 9 Feb 2022 7:30 PM IST
Minister Perni Nani Meeting With CM Jagan
X

సీఎం జగన్‌తో మంత్రి పేర్నినాని సమావేశం

Andhra Pradesh: తాడేపల్లిలోని నివాసంలో సీఎం జగన్‌తో మంత్రి పేర్నినాని సమావేశమయ్యారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ భేటీలో చిరంజీవి, నాగార్జునతో పాటు పలువురు దర్శక నిర్మాతలు పాల్గొననున్నారు.

దీంతో ఈ భేటికి సంబంధించి పలు అంశాలపై జగన్‌తో మంత్రి పేర్నినాని చర్చించారు. టికెట్ల ధరలు, ఇండస్ట్రీకి ప్రయోజనాలు కల్పించే అంశాలతో పాటు టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికపై సీఎంతో మంత్రి చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. రేపు హైకోర్టులో టికెట్ల ధరల పెంపుపై విచారణ జరగనుంది. దీంతో కోర్టుకు ప్రభుత్వం ఏం చెప్పాలన్న అంశంపైనా ఇరువురు చర్చించినట్టు సమాచారం.

Rama Rao

Rama Rao

Next Story