నేను భజన చేస్తా.. చిడతలు కొడతా.. నాది స్వామి భక్తి : పేర్నినాని

X
Highlights
తాను చచ్చేంత వరకూ వైఎస్ కుటుంబానికి భక్తుడిగానే ఉంటానని ఏపీ మంత్రి పేర్నినాని అన్నారు. తనపై జనసేనాని పవన్...
Arun Chilukuri29 Dec 2020 11:37 AM GMT
తాను చచ్చేంత వరకూ వైఎస్ కుటుంబానికి భక్తుడిగానే ఉంటానని ఏపీ మంత్రి పేర్నినాని అన్నారు. తనపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై నాని ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్‌లాగ తాను రోజుకొకరికి చిడతలు కొట్టడం లేదని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ క్యాష్ కోసం చిడతలు కొట్టే చిడతల నాయుడుని పేర్ని నాని అన్నారు. 2014 నుంచి పవన్ కళ్యాణ్ చిడతలు కొడుతూ ఉన్నాడని నాని గుర్తుచేశారు. మోడీకి, చంద్రబాబుకి, కమ్యూనిస్టు పార్టీలకు మార్చి మార్చి చిడతలు కొట్టిన చరిత్ర పవన్ కళ్యాణ్‌దని నాని అన్నారు. జన సేన పార్టీ పెట్టి అన్యాయాన్ని ప్రశ్నిస్తామనన పవన్..పార్టీ పెట్టి ప్రశ్నించడం మరిచిపోయాడని నాని ఎద్దేవా చేశారు.
Web Titleminister perni nani fires on pawan kalyan
Next Story