Andhra Pradesh: పవన్‌ అజ్ఞాతవాసే కాదు..అజ్ఞానవాసి కూడా -పేర్ని నాని

Andhra Pradesh: కాపులకు కష్టం వచ్చినప్పుడు పవన్‌ ఎప్పుడైనా మాట్లాడారా..? -పేర్ని నాని

Samba Siva Rao
Updated on: 4 April 2021 5:07 PM IST
Perni Nani Ccomments on pawan
X

పేర్ని నాని ఫైల్ ఫోటో 

Andhra Pradesh: ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. శనివారం జరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధికార పార్టీ నేతలే లక్ష్యంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే తిరుపతి సభలో వైసీపీ నేతలపై పవన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి పేర్ని నాని. పవన్‌ కళ్లు మూసుకుపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వివేకా హత్య కేసును సీబీఐ ఏడాది కాలంగా దర్యాప్తు చేస్తోందని, ఆ కేసును సీఎం జగన్‌కు ఆపాదించడమేంటని ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నారని మంత్రి అన్నారు. పవన్‌ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి కూడా అని పేర్ని నాని ఆరోపించారు. తనను చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారని పవన్‌ అన్నారని, అసలు ఎందుకు భయపడాలో పవన్‌ చెప్పాలని కోరారు పేర్ని నాని. ఎన్నికలు వచ్చినప్పుడే పవన్‌కు ప్రజలు గుర్తుకువస్తారని, కాపుల కష్టాలను పవన్‌ ఏనాడైనా పట్టించుకున్నాడా..? అని ప్రశ్నించారు పేర్ని నాని.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story