Ramachandra Yadav: పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి నీచ రాజకీయాలు మానుకోవాలి

Ramachandra Yadav: పోలీసులతో ప్రతిపక్షాలను అనగదొక్కడం నీచమైన పని

Shekhar G
Published on: 29 July 2023 7:50 AM IST
Minister Peddireddy Should Avoid Dirty Politics In Punganur Says Ramachandra Yadav
X

Ramachandra Yadav: పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి నీచ రాజకీయాలు మానుకోవాలి

Ramachandra Yadav: పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి నీచ రాజకీయాలు మానుకోకపోతే ప్రజలు తిరుగుబాటు తప్పదని భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ హెచ్చరించారు. తిరుపతి ఎయిర్ పోర్టులో దిగి పుంగనూరు వస్తుండగా పోలీసులను ప్రయోగించి అడ్డుకునే ప్రయత్నం దుర్మార్గమన్నారు. ప్రజా నాయకుడు అని చెప్పుకొనే పెద్దిరెడ్డి... దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లో సత్తా నిరూపించుకోవాలే తప్ప... అధికారాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలను అనగదొక్కడం నీచమైన పనికి నిదర్శనమన్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి కల్లూరు చేరుకోడానికి రామచంద్ర యాదవ్ కాన్వాయ్ 6 గంటల సమయం పట్టిందంటే.. మార్గమధ్యలో తిరుపతి, చిత్తూరు జిల్లా పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం, ఇబ్బందులు పెట్టడాన్ని ప్రజలంతా గమనించారని పేర్కొన్నారు. ప్రజల్లో వచ్చిన మార్పుతో వచ్చే ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికి సాగనంపుతామన్నారు.

Shekhar G

Shekhar G

Next Story