Peddireddy: చంద్రబాబుకు మతిస్థిమితం లేదు.. ఇది ప్రకృతి విపత్తు..

Peddireddy: అధికారంలోకి రావాలన్న ధ్యాసతోనే చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Arun Chilukuri
Published on: 24 Nov 2021 3:05 PM IST
Minister Peddireddy Ramachandra Reddy Slams Chandrababu
X

Peddireddy: చంద్రబాబుకు మతిస్థిమితం లేదు.. ఇది ప్రకృతి విపత్తు.. 

Peddireddy: అధికారంలోకి రావాలన్న ధ్యాసతోనే చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటోందని చెప్పిన ఆయన ప్రతి కుటుంబానికి నష్ట పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే అధికారులు వరద నష్టం అంచనా వేస్తున్నారని జిల్లాలో రోడ్లు, పంటలకు 70 నుంచి 80 శాతం నష్టం వాటిల్లిందని అన్నారు.

ఇది ప్రకృతి విపత్తు, ఊహించని నీరు రావడం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు తెగింది తప్ప, ఇందులో ఎవరి తప్పులేదన్నారు. తాను అధికారంలోకి వచ్చాక వరద బాధితులకు పరిహారం ఇస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు మంత్రి పెద్దిరెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story