Peddireddy Ramachandra Reddy: దౌర్జన్యంతో కుప్పంలో గెలవాలన‍్నది చంద్రబాబు ఆలోచన..

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు కుప్పం పర్యటనపై మంత్రి పెద్దిరెడ్డి ఫైరయ్యారు.

Arun Chilukuri
Updated on: 27 Aug 2022 2:43 PM IST
Minister Peddireddy Ramachandra Reddy Counter To Chandrababu
X

Peddireddy Ramachandra Reddy: దౌర్జన్యంతో కుప్పంలో గెలవాలన‍్నది చంద్రబాబు ఆలోచన..

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు కుప్పం పర్యటనపై మంత్రి పెద్దిరెడ్డి ఫైరయ్యారు. చంద్రబాబు కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవలేననే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆయన కుప్పంలో ప్రజలను రెచ్చగొట్టి చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకున్నారన్నారు. చంద్రబాబు కుప్పం వచ్చి విధ్వంసం సృష్టించారన్నారు. 33 ఏళ్లుగా కుప్పానికి చంద్రబాబు చేసేందేమీ లేదని, ప్రజలపై దాడులు చేయడం నీతిమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి చేసుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఎందుకు గెలవలేకపోయారని ప్రశ్నించారు.

కోల్లుపల్లెలో వైసీపీ నేతలపై దాడి చేసింది టీడీపీ నేతలేనని.. వైసీపీ జెండాలను కట్టెలతో తొలగించింది టీడీపీ వాళ్లేనని మంత్రి పెద్దిరెడ్డి మీడియాకు వీడియోలు చూపించారు. కుప్పంలో చంద్రబాబు దౌర్జన్యాలతో గెలవాలని చూస్తున్నాడని అది జరగని పని అని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు కుప్పం వచ్చిన ప్రతీసారి అది బ్లాక్ డే అన్నారు. చంద్రబాబు మళ్లీ కుప్పంలో గెలిచేది కేవలం కలలో మాత్రమేనని అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story