బాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్.. నిరూపిస్తే రాజీనామా చేస్తా: పెద్దిరెడ్డి

బాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్.. నిరూపిస్తే రాజీనామా చేస్తా: పెద్దిరెడ్డి
x
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Highlights

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ విసిరారు. ఉపాధి హామీ నిధుల విడుదల కోసం ముడుపులు తీసుకున్నారని టీడీపీ నేతలు...

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ విసిరారు. ఉపాధి హామీ నిధుల విడుదల కోసం ముడుపులు తీసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి ముడుపులు తీసుకున్నట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్దమని సవాల్‌ విసిరారు. తన గురించి అన్నీ తెలిసిన చంద్రబాబు కూడా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఉపాధి నిధులు దారిమళ్లించారని చంద్రబాబు, టీడీపీ ఎంపీలు కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. నిధులు రాకుండా ఓవైపు లేఖలు రాస్తూ మరోవైపు రాష్ట్రాభివృద్ధి కుటంపడిందని ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories