Kalki 2898 AD: ఇండియాను షేక్ చేస్తున్న క‌ల్కి మేనియా.. నారా లోకేష్ స్పెష‌ల్ ట్వీట్‌..

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ రిలీజైంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ వివిధ ప్రాంతాల్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Arun Chilukuri
Published on: 27 Jun 2024 1:41 PM IST
Minister Nara Lokesh Tweet After Kalki 2898 AD Release
X

Kalki 2898 AD: ఇండియాను షేక్ చేస్తున్న క‌ల్కి మేనియా.. నారా లోకేష్ స్పెష‌ల్ ట్వీట్‌..

Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ రిలీజైంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ వివిధ ప్రాంతాల్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ థియేటర్ల వద్ద టపాసులు పేల్చి, ప్రభాస్ కటౌట్‌కు పాలాభిషేకాలు చేశారు. ‌కొబ్బరికాయలు కొడుతూ జై రెబల్ స్టార్ జై ప్రభాస్ అంటూ నినాదాలు చేశారు. ఈ సినిమా హిట్ కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు హిట్ టాక్ రావ‌డం పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. సినిమాకు మంచి రివ్య్వూలు రావ‌డం త‌న‌కు చాలా సంతోషాన్ని క‌లిగించింద‌న్నారు. సినిమా హిట్టైనందుకు ప్ర‌భాస్‌, అమితాబ్‌, క‌మ‌ల్ హాస‌న్‌, దీపికా ప‌దుకోన్‌, ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌ల‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని మ‌రో స్థాయికి తీసుకువెళ్లినందుకు చిత్ర నిర్మాతలు అశ్వినీద‌త్ తో పాటు ఆయ‌న కూతుళ్లు స్వ‌ప్న, ప్రియాంక‌లు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. కాగా.. లోకేష్ ఈ సినిమా పైనే కాదు గ‌తంలో విడుద‌లైన ప‌లు సినిమాలు విజ‌యాలు సాధించిన సంద‌ర్భాల్లో శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story