క్షుద్ర పూజలు కేసును డైవర్ట్ చేయడానికే.. : హోంమంత్రి సుచరిత

క్షుద్ర పూజలు కేసును డైవర్ట్ చేయడానికే.. : హోంమంత్రి సుచరిత
x
Highlights

క్షుద్ర పూజలు కేసును డైవర్ట్‌ చేసేందుకే అని హోంమంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు. నిందితుడు అఖిల్ సాయి ఉద్దేశపూర్వకంగానే వరలక్ష్మిని హత్య చేశాడని...

క్షుద్ర పూజలు కేసును డైవర్ట్‌ చేసేందుకే అని హోంమంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు. నిందితుడు అఖిల్ సాయి ఉద్దేశపూర్వకంగానే వరలక్ష్మిని హత్య చేశాడని విచారణలో తేలిందని హోంమంత్రి స్పష్టం చేశారు. 7 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తామని ఆమె వెల్లడించారు. విశాఖ గాజువాకలోని బాధిత కుటుంబాన్ని హోంమంత్రి పరామర్శించారు. విద్యార్థిని వరలక్ష్మి కుటుంబానికి హోంమంత్రి మేకతోటి సుచరిత రూ.10 లక్షల చెక్‌ను అందజేశారు. సోమవారం వరలక్ష్మి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వరలక్ష్మి కుటుంబానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామన్నారు. నిందితుడు అఖిల్‌కు మరికొంతమంది సహకరించారని ఆరోపించిన వరలక్ష్మి తల్లిదండ్రులు.. అఖిల్‌కు రౌడీషీటర్లతో సంబంధాలున్నాయని తమకు రక్షణ కల్పించాలని సుచరితను కోరారు. వారికి రక్షణ కల్పించాలని పోలీసులను సుచరిత ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories