Nara Lokesh: మాజీ సీఎం జగన్‌పై ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ఆగ్రహం
Nara Lokesh: వైసీపీ ఆఫీస్‌ల నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేష్
Nara Lokesh: మాజీ సీఎం జగన్‌పై ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ఆగ్రహం
Nara Lokesh: ఏపీలో వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా? వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావని ప్రశ్నించారు. 600 కోట్ల రూపాయల విలువైన ఈ భూముల్లో 4 వేల 200 మందికి స్థలాలివ్వొచ్చని ట్వీట్ చేశారు నారా లోకేశ్. నిర్మాణాలకు ఖర్చయ్యే 500 కోట్ల రూపాయాలతో25 వేల మందికి ఇళ్లు కట్టొచ్చన్నారు. ఏంటీ ఈ ప్యాలెస్‌ల పిచ్చి, నీ ధనదాహానికి అంతు లేదా అంటూ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు నారా లోకేష్.
Next Story




