ఇంద్రకీలాద్రిలో పోలీసులపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం

Kottu Satyanarayana: డ్యూటీ చేయమంటే మీవాళ్లను పంపుకుంటారా అంటూ ఆగ్రహం

Rama Rao
Published on: 30 Sept 2022 3:35 PM IST
Minister Kottu Satyanarayana Fire on Police on Indrakeeladri
X

ఇంద్రకీలాద్రిలో పోలీసులపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం

Kottu Satyanarayana: విజయవాడ ఇంద్రకీలాద్రిలో పోలీసుల తీరుపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో చినరాజగోపురం వీఐపీ ఎంట్రీ పాయింట్ వద్ద కుటుంబ సభ్యులను పోలీసులు దర్శనానికి తీసుకెళ్తున్నారు. డ్యూటీ చేయమంటే మీ వాళ్లను పంపుకుంటారా అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూటీ చేయడం ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చంటూ హెచ్చరించారు. సీపీకి కాల్ చేసి పోలీసుల తీరుపై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫిర్యాదు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story