Kodali Nani: మూడు రాజధానులను చేసి తీరుతాం

Kodali Nani: మరోసారి మూడు రాజధానులపై కుండబద్ధలు కొట్టారు మంత్రి కొడాలి నాని.

Arun Chilukuri
Published on: 21 Dec 2021 6:35 PM IST
Minister Kodali Nani Sensational Comments on AP Three Capitals
X

Kodali Nani: మూడు రాజధానులను చేసి తీరుతాం

Kodali Nani: మరోసారి మూడు రాజధానులపై కుండబద్ధలు కొట్టారు మంత్రి కొడాలి నాని. కృష్ణా జిల్లా గుడివాడలో జగనన్న గృహ హక్కు పథకాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని ఏపీలో మూడు రాజధానులను చేసి తీరుతామని స్పష‌్టం చేశారు. విశాఖలో సెక్రటరియేట్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చెయ్యక తప్పదన్నారు. అలాగే అమరావతి కూడా రాజధానిగా ఉంటుందని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అని చెప్పారు.

30వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో అమరావతి ఏర్పాటు చెయాలనే నాడు ప్రతి పక్షనేతగా జగన్మోహన్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని కొడాలి నాని సవాల్ విసిరారు. తనకు చెందిన వారికి లబ్ధి చేకూర్చేందుకే ల్యాండ్ పులింగ్ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పేరుతో టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story