Kodali Nani: ఎన్నికలను కావాలనే అడ్డుకుంటున్నారు- కొడాలి నాని

X
ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )
Highlights
Kodali Nani: ఏపీలో పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంపై స్పందించారు మంత్రి కొడాలి నాని.
Arun Chilukuri6 April 2021 12:24 PM GMT
Kodali Nani: ఏపీలో పరిషత్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించడంపై స్పందించారు మంత్రి కొడాలి నాని. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాకూడదనే వేగంగా ఎన్నికలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
హైకోర్టు నిర్ణయంపై రేపు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తామని, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఎన్నికలకు భయపడి పారిపోయిన టీడీపీ, ఓడిపోతామని తెలిసి, నామమాత్రపు స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ, జనసేనలు ఎన్నికలను అడ్డుకుంటున్నాయని విమర్శించారు. హౌస్ మోషన్ పిటిషన్‌లో 21రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినా తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు మంత్రి కొడాలి.
Web TitleMinister Kodali Nani Response on High Court verdict on Panchayat Election 2021
Next Story