Kodali Nani: చంద్రబాబు మద్యం బ్రాండ్‌లు ప్రమోట్ చేస్తున్నారు

Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Samba Siva Rao
Published on: 7 March 2021 8:28 PM IST
Kodali Nani Comments On Chandrababu
X

కోడలి నాని ఫైల్ ఫోటో 

Kodali Nani Comments Chandrababu Naidu:టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పగటి వేషగాళ్ల మాదిరిగా పసుపు రంగు వ్యాన్, పసుపు కండువ వేసుకొని అబద్దాలతో ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ సంపూర్ణ మధ్యపానం నిషేధం అమలు చేస్తే..ప్రజల రక్తాన్ని జలగలా పీల్చుకు తిన్నారని విమర్శించారు. దమ్ము ధైర్యం ఉంటే పెట్రోల్, డీజిల్,గ్యాస్ ధరలు, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు మంత్రి బొత్స కూడా చంద్రబాబును దుయ్యబట్టారు. విశాఖ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ‌్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు మంత్రి బొత్స. ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేత.. ఇలా అసభ్య పదజాలం వాడటమేంటన్నారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో ఎమ్మార్వో ఆఫీస్‌ల్లో రికార్డులు తారమారైంది నిజం కాదా అని ప్రశ్నించారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story