తుఫాన్ పీడిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కారుమూరి

Minister Karumuri: పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ

Jyothi
Published on: 7 Dec 2023 8:14 AM IST
Minister Karumuri visited the Typhoon Affected Areas
X

తుఫాన్ పీడిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కారుమూరి

Minister Karumuri: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని వివిధ తుఫాన్ పీడిత ప్రాంతాల్లో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిశీలించారు. తడిచిన ధాన్యాన్ని దెబ్బతిన్న పంట పొలాలను, సుడిగాలితో కుప్పకూలిన ఇళ్లను ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులను అదుకుంటామని మంత్రి హామీనిచ్చారు.

తడిచిన ధాన్యాన్ని తేమ శాతాన్ని చూడకుండా రైతుల నుంచి సేకరించాలని ఆర్డీఓతో పాటు సంబంధిత అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎవరు రైస్ మిల్లర్స్ కి ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదని రైతులకు మంత్రి తెలిపారు. రైస్ మిల్లర్స్ ఎవరైనా డబ్బు వసూలు చేస్తే అటువంటి రైస్ మిల్లును బ్లాక్ లిస్టులో పెడతామని మంత్రి హెచ్చరించారు.

Jyothi

Jyothi

Next Story