పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలు స్థిరంగా ఉండవు..: మంత్రి కన్నబాబు

పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలు స్థిరంగా ఉండవు..: మంత్రి కన్నబాబు
x
కన్నబాబు
Highlights

చంద్రబాబు, పవన్‌పై మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ వారికి వారి ఆస్తులు, భూముల పోతాయని బాధగా ఉందన్నారు. హైకోర్టు ఒకచోట, రాజధాని మరోచోట ఉన్న...

చంద్రబాబు, పవన్‌పై మంత్రి కన్నబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ వారికి వారి ఆస్తులు, భూముల పోతాయని బాధగా ఉందన్నారు. హైకోర్టు ఒకచోట, రాజధాని మరోచోట ఉన్న రాష్ట్రాలు దేశంలో చాలా ఉన్నాయని చెప్పారు. పవన్ కల్యాణ్ ఆలోచనలు స్థిరంగా ఉండవని అన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే జగన్ సంకల్పమని చెప్పారు. రాజధానిపై ముఖ్యమంత్రి స్పష్టమైన వైఖరి చెప్పారని మంత్రి క‍న్నబాబు తెలిపారు.

గ్రామల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, వాటి ద్వారానే విత్తనాలు సరఫరా చేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు. అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో అగ్రి ఇన్‌పుట్‌ షాపులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో నెలాఖరు వరకూ రైతు భరోసాకు అవకాశం కల్పిస్తామన్నారు. భూసార పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామని, రైతులకు కల్తీలేని ఎరువులు, పురుగుల మందులు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories