రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న మాజీమంత్రి అనిల్, తాజా మంత్రి కాకాని భేటీ...

Nellore: తాజా భేటీ తరువాత అనిల్ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది...

Shireesha
Published on: 26 April 2022 6:24 PM IST
Minister Kakani Govardhan Reddy And Anil Kumar Yadav Meeting Sensation in Nellore Politics | Live News
X

రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న మాజీమంత్రి అనిల్, తాజా మంత్రి కాకాని భేటీ...

Nellore: నెల్లూరు అధికార పార్టీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల అనిల్ కుమార్, కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు భేటీ కావడంపై ఆసక్తి రేగుతోంది.

దాదాపు అరగంట సేపు ఇద్దరు నేతలూ వివిధ అంశాల మీద చర్చించుకున్నారు. కాకాని ప్రమాణ స్వీకారం తరువాత జిల్లాకు చేరుకున్న తరుణంలో కాకాని ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేయడం వైసీపీ రాజకీయాల్లో కలకలం రేపింది. తాజా భేటీ తరువాత అనిల్ స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

Shireesha

Shireesha

Next Story