Tirupati-Delhi: ఢిల్లీ-తిరుప‌తి మ‌ధ్య స్పైస్ జెట్ విమాన స‌ర్వీసులు

Tirupati-Delhi Flight: ఇవాళ ప్రారంభించిన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

Sandeep Eggoju
Published on: 17 Oct 2021 5:06 PM IST
Minister Jyotiraditya Scindia Inaugurates Spicejet Flight Between Delhi and Tirupati in Andhra Pradesh
X

ఢిల్లీ-తిరుపతి విమాన సర్వీసులు ప్రారంభించిన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (ఫైల్ ఇమేజ్)

Tirupati-Delhi Flight: దేశ రాజ‌ధాని ఢిల్లీ, తిరుప‌తి మ‌ధ్య నూత‌న విమాన స‌ర్వీసు ప్రారంభ‌మైంది. స్పైస్ జెట్ విమానయాన సంస్థకు చెందిన ఈ స‌ర్వీసును భార‌త‌ పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. మొద‌టి స‌ర్వీసు ఇవాళ ఉద‌యంప్రారంభమైంది. విమాన స‌ర్వీసు ప్రారంభం సంద‌ర్భంగా సింధియా మాట్లాడుతూ.. స్పైస్ జెట్ సంస్థ త‌న నూత‌న స‌ర్వీసు ద్వారా దేశ రాజ‌కీయ రాజ‌ధాని ఢిల్లీని ఆధ్యాత్మిక రాజ‌ధాని తిరుప‌తితో క‌లుపుతున్నద‌ని పేర్కొన్నారు. తిరుమ‌ల దేవ‌స్థానాన్ని ఏటా 3.5 కోట్ల మంది భ‌క్తులు ద‌ర్శించుకుంటున్నార‌ని మంత్రి వెల్లడించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story