అనురాగ్ ఠాగూర్ విమర్శలకు జోగి రమేష్ కౌంటర్ ఎటాక్.. దమ్ముంటే చర్చకు రావాలని..

Jogi Ramesh: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ విమర్శలపై ఏపీ మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఎటాక్ చేశారు.

Arun Chilukuri
Updated on: 21 Aug 2022 8:45 PM IST
Minister Jogi Ramesh Counter To Union Minister Anurag Thakur
X

అనురాగ్ ఠాగూర్ విమర్శలకు జోగి రమేష్ కౌంటర్ ఎటాక్.. దమ్ముంటే చర్చకు రావాలని..

Jogi Ramesh: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ విమర్శలపై ఏపీ మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఎటాక్ చేశారు. విమర్శలు చేసే ముందు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి తెలుసుకుని మాట్లాడాలని ఆయన హితవు చెప్పారు. ఈ మూడేళ్లలో 2 లక్షల మంది యువతకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చామని, మరో 90 వేల మందికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చామని జోగి రమేష్ వెల్లడించారు.

ఇవేమీ తెలుసుకోకుండా టీడీపీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే సరిపోతుందా అని ఆయన ఎదురుదాడి చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? అని రమేష్ ప్రశ్నించారు. దమ్ముంటే చర్చకు వచ్చి సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ పెంచి, పోషించిన చంద్రబాబే దోపిడీకి పాల్పడ్డారని జోగి రమేష్ విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story