కాంగ్రెస్‌ నేతలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

Minister Jagadish Reddy Fires on Congress Leaders
x

Minister Jagadish Reddy (file image)

Highlights

* కాంగ్రెస్ నేతల మాటల తీరును ఖండించిన మంత్రి * దేశంలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచింది : మంత్రి * నల్గొండ ఫ్లోరైడ్‌ భూతానికి మిషన్‌ భగీరథతో చెక్ : జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ దివాళాకోరుతనం మరోసారి బయటపడిందని మంత్రి జగదీష్‌ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు మాట్లాడిన తీరును మంత్రి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అన్ని అంశాల్లో దేశంలో నెంబర్‌వన్ స్థాయికి ఎదిగిందని ఇదే సత్యాన్ని అన్ని నివేదికలు స్పష్టం చేశాయని మంత్రి అన్నారు. నల్గొండలో ఒక్క ఫ్లోరైడ్ కేసు నమోదు కాలేదంటే అది మిషన్ భగీరథ ఫలితమే అని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌కు వణుకు పుడుతోందని అందుకే తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. కళ్లముందు కనిపిస్తున్న కాళేశ్వరం గొప్పతనం ఉత్తమ్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల మాటల తీరును ఖండించిన మంత్రి.

Show Full Article
Print Article
Next Story
More Stories