Gudivada Amarnath: అమరరాజా ప్రతినిధులు అలా ఎక్కడైనా చెప్పారా..?

Minister Gudivada Amarnath Comments On Amararaja Investments
x

Gudivada Amarnath: అమరరాజా ప్రతినిధులు అలా ఎక్కడైనా చెప్పారా..?

Highlights

Gudivada Amarnath: తెలంగాణలో అమర్ రాజా పెట్టుబడులపై వస్తున్న వార్తలపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు.

Gudivada Amarnath: తెలంగాణలో అమర్ రాజా పెట్టుబడులపై వస్తున్న వార్తలపై ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. అమర్ రాజా సంస్థ ప్రతినిధులు ఏపీలో పెట్టాల్సిన పెట్టుబడులు తెలంగాణలో పెడుతున్నామని ఎక్కడైనా చెప్పారా అని ఆయన ప్రశ్నించారు. అమరరాజా సంస్థ ఒక ఏపీలోనే ఉండాలనే నిబంధన ఏమైనా ఉందా అన్న మంత్రి..అమర్ రాజా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రల్లో ఉందన్నారు.. దానిలో భాగంగానే ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతోందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హెరిటేజ్ ఆంద్రప్రదేశ్, తెలంగాణలో ఉందన్న విషయాన్ని మంత్రి గుడివాడ గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతల పరిశ్రమలు ఏపీలో ఉండకూడదు అనుకుంటే చంద్రబాబు హెరిటేజ్ ఏపీలో ఉండేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిశ్రమలను ఎన్నడూ రాజకీయ కోణంలో చూడలేదన్నారు మంత్రి గుడివాడ.

Show Full Article
Print Article
Next Story
More Stories