చంద్రబాబు పవిత్రమైన హిందువైతే.. విజయవాడలో హిందూ దేవాలయాలను ఎందుకు కూల్చారు : మంత్రి బొత్స

చంద్రబాబు పవిత్రమైన హిందువైతే.. విజయవాడలో హిందూ దేవాలయాలను ఎందుకు కూల్చారు : మంత్రి బొత్స
x
Highlights

ఏపీ మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు మతాల మధ్య గొడవ పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి...

ఏపీ మున్సిపల్‌ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ చీఫ్ చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు మతాల మధ్య గొడవ పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పవిత్రమైన హిందువైతే విజయవాడలో హిందూ దేవాలయాలను ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. ఆలయాలను కూల్చినప్పుడు చంద్రబాబుకు హిందువులు గుర్తురాలేదా? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. రామతీర్థం ఘటన జరిగిన వెంటనే మేం స్పందించామని, ఆలయ ఛైర్మన్ అశోక్‌గజపతిరాజు ఎందుకు వెళ్లలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. రామతీర్థం ఘటనపై విచారణలో అసలు రంగు బయటపడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories