వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కష్టాలు తొలగిపోయాయి : మంత్రి బొత్స

X
Highlights
రాష్ర్టంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కష్టాలు తొలగిపోయాయని రాష్ర్ట మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ...
Arun Chilukuri31 Dec 2020 1:54 PM GMT
రాష్ర్టంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల కష్టాలు తొలగిపోయాయని రాష్ర్ట మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ముఖ్యంగా సీఎం జగన్ పేదల సొంతింటి కల నెరవేర్చారని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా రాష్ర్ట వ్యాప్తంగా 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడం జరుగుతుందని అన్నారు. కరోనా విపత్కర పరిస్థుతులను అధిగమించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని బొత్స చెప్పారు.
Web TitleMinister Botsa Satyanarayana Praises CM Jagan
Next Story