విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రభుత్వం వ్యతిరేకం: మంత్రి బొత్స

X
Highlights
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు మంత్రి బొత్స. విశాఖ...
Arun Chilukuri14 Feb 2021 1:04 PM GMT
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అవసరమైతే అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు మంత్రి బొత్స. విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉన్నది వాస్తవమేనని తెలిపారు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ అనేది ఒక్క విశాఖపట్నానికో, విజయనగరానికో, శ్రీకాకుళానికి పరిమితమైన అంశం కాదని, ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి చెందిన అంశమని స్పష్టం చేశారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడాన్ని అడ్డుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Web Titleminister botsa on Visakha steel plant Privatization
Next Story