Avanti Srinivas Fires on Raghurama Krishna Raju: రఘురామకృష్ణంరాజు ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఉపీక్షించం : మంత్రి అవంతి

Arun Chilukuri
Published on: 26 July 2020 1:13 PM IST
Avanti Srinivas Fires on Raghurama Krishna Raju: రఘురామకృష్ణంరాజు ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఉపీక్షించం   : మంత్రి అవంతి
X

Avanthi Srinivas Fires on Raghurama Krishnam Raju: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఉపేక్షించేది లేదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ రావు హెచ్చరించారు. ఆదివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి బిక్షతో లోక్ సభలో అడుగు పెట్టారన్న విషయం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో మాత్రమే నాగబాబుపై మీరు గెలుపొందారు. మీకు భిక్ష పెట్టిన సీఎం పై విమర్శలు చేయడం తగదు. వైసిపీ జెండాపై గెలిచిన మీరు టిడిపి నాయకుల కంటే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. నర్సాపురం వరకు పరిమితం కండి. అన్ని విషయాల్లో జోక్యం కల్పించుకుంటే బావుండదు.

విశాఖ రాజధాని వద్దని చెప్పడానికి రఘురామ కృష్ణం రాజు ఎవరు ? ఇలా మాట్లాడిన చంద్రబాబు నాయుడు నే వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా ప్రజలు అడ్డుకున్నారని తెలుసుకోండి. రఘురామ కృష్ణం రాజు మీ పంథా మార్చుకొకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమించరు. వైసిపీ విధానాలు నచ్చకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేయండి. నలందా కిషోర్‌ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ మరణాన్ని కూడా చంద్రబాబు, లోకేష్‌ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కిషోర్‌ టీడీపీ అభిమాని. ఆయన మరణానికి మేము కూడా సంతాపం తెలియజేస్తున్నాము. నలందా కిషోర్‌పై అభిమానం ఉంటే అచ్చన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్‌ ఇప్పుడు కిషోర్‌ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story