మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు దిట్ట: మంత్రి అవంతి

మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు దిట్ట: మంత్రి అవంతి
x
Highlights

మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు దిట్ట అంటూ మండిపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాస్. విశాఖలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే కక్ష సాధింపు...

మైండ్ గేమ్ ఆడడంలో చంద్రబాబు దిట్ట అంటూ మండిపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాస్. విశాఖలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటే కక్ష సాధింపు చర్యలు అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరికీ ఎటువంటి వివక్షా లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న మంత్రి.. ప్రతిపక్షాలు దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తున్నట్లు టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. సీఎం జగన్ ముందు టీడీపీ మైండ్ గేమ్‌లు పనిచేయవన్నారు. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు మాజీలు భూ కబ్జాలకు పాల్పడి వైసీపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

విశాఖలో బాక్సైట్ తవ్వకాలను అనుమతించం: విజయసాయిరెడ్డి

విశాఖలో బాక్సైట్ తవ్వకాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో ప్రభుత్వ భూములు ఆక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories