Audimulapu Suresh: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌కి తప్పిన ప్రమాదం

Audimulapu Suresh: విశాఖలో పారా మోటరింగ్ చేస్తుండగా పక్కకు ఒరిగిన ఇంజిన్

Dhatripriya
Published on: 26 March 2023 9:27 AM IST
Minister Audimulapu Suresh Escape Accident In Vizag
X

Audimulapu Suresh: ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌కి తప్పిన ప్రమాదం

Audimulapu Suresh: విశాఖ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ ఆర్కే బీచ్‌లో పారా మోటరింగ్‌కు వెళ్లేందుకు మంత్రి సిద్ధమవ్వగా..ఇసుక తిన్నెల్లో ఇంజన్ పక్కకు ఒరిగిపోయింది. దీంతో మంత్రి ఆదిమూలపు సురేష్‌కు పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ కాకుండానే మంత్రి దిగిపోయారు. G20 సదస్సులో భాగంగా విశాఖలో మారథాన్, సాహస క్రీడలు జరుగుతున్నాయి. ఉదయం మారథాన్ ప్రారంభించిన సురేష్.. నిర్వహకుల ఆహ్వానం మేరకు పారా మోటరింగ్ రైడ్ బయలు దేరడంతో ఘటన చోటు చేసుకుంది.

Dhatripriya

Dhatripriya

Next Story