శ్రీశైలం ప్రాజెక్టుకు ఎటువంటి ముప్పు లేదు : మంత్రి అనిల్ కుమార్

Anil Kumar Yadav
x
Anil Kumar Yadav
Highlights

శ్రీశైలం ప్రాజెక్టుకు, డ్యామ్‌కు ఎటువంటి ముప్పు లేదన్నారు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్. డ్యామ్‌ పరిస్థితిపై మంత్రి అధికారులతో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు, డ్యామ్‌కు ఎటువంటి ముప్పు లేదన్నారు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్. డ్యామ్‌ పరిస్థితిపై మంత్రి అధికారులతో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నారు. శ్రీశైలం డ్యామ్ సేఫ్టీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రాజెక్టులపై నిర్లక్ష్యం అంటూ వస్తున్న వార్తలు సత్యదూరమన్నారు. ప్రజల్లో అనుమానాలు, అపోహలు కల్పించవద్దని కోరారు.

శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని సీ.ఈ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. డ్యామ్ భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆరవ గేటు వద్ద భద్రత కోసం ఎనర్జీ డిస్పెషన్ ఉందన్నారు. పంజ్‌పూల్‌ అనేది డ్యామ్‌లో ఒక భాగమేనని చెప్పారు. దానిపై నిపుణులతో పరిశీలింపజేస్తామని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories