మాటంటే మాటే : కీలక ప్రకటన చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

మాటంటే మాటే : కీలక ప్రకటన చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్
x
Highlights

తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపన పోలేదన్నారు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. 20శాతం ప్రాజెక్టు పనులు పూర్తి...

తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపన పోలేదన్నారు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. 20శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేయని చంద్రబాబు తన జీవితంలో ఏ ప్రాజెక్టు పూర్తిచేయలేదంటూ ఎద్దేవా చేశారు. దివంగత రాజేశేఖర్‌ రెడ్డి చరిత్ర కల్గిన ప్రాజెక్టులను పూర్తి చేశారని చెప్పుకొచ్చారు.

ప్రధానికి రాసే లేఖలో కూడా చంద్రబాబు నిజాలు రాయలేదంటూ ఫైరయ్యారు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు ఎంత అవుతుందో తెలియని చంద్రబాబు ప్రాజెక్టు గురించి మాట్లాడటం ఏంటో ఆయనకే తెలియాలన్నారు.

తమ ప్రభుత్వం వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌లో 800కోట్ల రూపాయలను ఆదా చేశామన్నారు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. కరోనా సమయంలో కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపలేదన్నారు ఆయన. చెప్పిన సమయానికి తమ ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు అనిల్‌ కుమార్‌ యాదవ్‌.

పోలవరం ప్రాజెక్టు దివంగత రాజేశేఖర్‌ రెడ్డి ప్రారంభిస్తే సీఎం జగన్‌ ఆప్రాజెక్టును పూర్తి చేస్తారన్నారు మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌. మధ్యలో వచ్చిన వాళ్లు ప్రాజెక్టు పూర్తి చేయకుండా మధ్యలోనే పోతారంటూ విమర్శించారు. ఎప్పటికైనా ప్రాజెక్టు పూర్తి చేసేది తమ ప్రభుత్వమేన్నారు మంత్రి అనిల్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories