Andhra Pradesh: 40 ఇయర్స్ ఇండస్ట్రీకీ ఈ విషయం తెలుసు- మంత్రి అనిల్

Andhra Pradesh: టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri
Updated on: 10 Jun 2021 5:30 PM IST
Minister Anil Kumar Yadav Slams Nara Lokesh
X

Andhra Pradesh: 40 ఇయర్స్ ఇండస్ట్రీకీ ఈ విషయం తెలుసు- మంత్రి అనిల్

Andhra Pradesh: టీడీపీ నేత నారా లోకేష్‌పై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. తాత, తండ్రి పేర్లు చెప్పుకుని పబ్బం గడుపుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు టీడీపీ పనయిపోయిందని గుర్తించారన్నారు. అందుకే రాష్ట్రాన్ని వదిలి హైదరాబాద్‌లో మకాం వేశారని ఎద్దేవా చేశారు.

పోలవరం ప్రాజెక్ట్‌ను అడ్డుకోవాలని టీడీపీ కుట్ర చేస్తోంది. రైతుల కళ్లలో ఆనందాన్ని టీడీపీ చూడలేకపోతోంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ పోలవరం పనులు కొనసాగుతున్నాయి ఎదో ఒక రకంగా దాన్ని ఇబ్బంది పెట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అది పూర్తి అయితే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్సార్‌కి మంచి పేరు వస్తుందని వారి భయం. అందుకే రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు అని మంత్రి అనిల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story