దేశచరిత్రలో ఓడిపోతే సంబరాలు చేసుకుంది ఒక్క చంద్రబాబు పార్టీనే: మంత్రి అనిల్‌

దేశచరిత్రలో ఓడిపోతే సంబరాలు చేసుకుంది ఒక్క చంద్రబాబు పార్టీనే: మంత్రి అనిల్‌
x

దేశచరిత్రలో ఓడిపోతే సంబరాలు చేసుకుంది ఒక్క చంద్రబాబు పార్టీనే: మంత్రి అనిల్‌ 

Highlights

దేశ చరిత్రలో ఓడిపోతే సంబరాలు చేసుకుంది ఒక్క చంద్రబాబు పార్టీ మాత్రమేనని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విమర్శించారు.

దేశ చరిత్రలో ఓడిపోతే సంబరాలు చేసుకుంది ఒక్క చంద్రబాబు పార్టీ మాత్రమేనని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. కేవలం 16శాతం స్థానాలు సాధించి సంబరాలు చేసుకోవడం ఏంటని ఎద్దేవా చేశారు. టీడీపీకి వచ్చిన 16శాతం కూడా వైసీపీ రెబల్స్‌ వల్ల వచ్చాయని తెలిపారు. నాలుగో విడతలో 41 శాతం గెలిచామని చంద్రబాబు అభూత కల్పన చేస్తున్నాడని మండిపడ్డారు. పైగా ప్రతి విడతలో టీడీపీ పుంజుకుంది అని బాబు చెప్పడం మరీ విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన వల్ల రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు తమకు విజయాన్ని అందించారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories