పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ 80 % గెలవడం ఖాయం - అనిల్ కుమార్

X
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ 80 % గెలవడం ఖాయం - అనిల్ కుమార్
Highlights
*పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ 25 % సీట్లు సాధించి చూపాలి - అనిల్ కుమార్ *సీఎం పై నమ్మకంతోనే కనీవినీ ఎరుగని రీతిలో ఏకగ్రీవాలు - అనిల్ కుమార్
Arun Chilukuri28 Jan 2021 2:30 PM GMT
పంచాయతీ ఎన్నికలు కావాలి కావాలి అని ఆవేశ పడ్డ టీడీపీ కనీసం 25 శాతం సీట్లు సాధించి సత్తా చాటుకోవాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ 80 శాతం గెలవడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేసారు. ఏకగ్రీవాలపై టీడీపీ ఆరోపణలు అర్థం లేనివని కొట్టిపారేసారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై నమ్మకంతోనే కనీవినీ ఎరుగని రీతిలో ఏకగ్రీవాలు జరిగాయని అనిల్ కుమార్ తెలిపారు. వాలంటీర్ ల జోక్యం పై మంత్రి మాట్లాడుతూ పార్టీ గుర్తే లేని పంచాయతీ ఎన్నికల్లో వారి ప్రమేయం ఉంటుందనే ఆరోపణలు ఎంత వరకు సబబో టీడీపీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
Web TitleMinister Anil Kumar Yadav expresses confidence over victory in Panchayat elections
Next Story