విగ్రహ విధ్వంసకులకి అనిల్ శాపనార్ధాలు

X
Highlights
రాష్ట్రంలో ఆలయాలపై దాడులు చేస్తున్న వారు కచ్చితంగా దేవుడి శిక్షకు గురి అవుతారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి...
Arun Chilukuri4 Jan 2021 11:45 AM GMT
రాష్ట్రంలో ఆలయాలపై దాడులు చేస్తున్న వారు కచ్చితంగా దేవుడి శిక్షకు గురి అవుతారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆలయాలపై దాడులు చేసిన వారు బాగుపడరని శాపనార్థాలు పెట్టారు. నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గుడుల పై దాడి చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. టీడీపీ వాళ్ళు కోర్టులకెళ్లిన కారణంగా ఇన్ని రోజులు ఆలస్యం ఐయింది,కమిషన్ల కోసం గత ప్రభుత్వాలు ఇళ్లు నిర్మించాయని విమర్శించారు. గత ప్రభుత్వం హయాంలో ప్రతి పేదవాడి పైన 3లక్షల అప్పు వేసే ప్రయత్నంచేశారని, ప్రతిపక్షంలో ఉన్నపుడు తాను అడ్డుకున్నానని గుర్తుచేశారు.
Web TitleMinister Anil Kumar Yadav comments on idols destroyers in ap
Next Story