Alla Nani: ఏపీలో ఆక్సిజన్ కొరత లేదు: మంత్రి ఆళ్ల నాని

Alla Nani: ఆక్సిజన్, మందుల కొరతను అధిగమించేందుకు కార్యాచరణ రూపొందించామని ఆళ్ల నాని చెప్పారు.

Samba Siva Rao
Published on: 22 April 2021 3:02 PM IST
Alla Naani saya no Shortage Of Oxygen
X
ఆళ్ల నాని ఫైల్ ఫోటో

Alla Nani: కరోనా కట్టడిపై ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమయ్యింది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించినట్లు మంత్రి ఆళ్లనాని చెప్పారు. ఆక్సిజన్, మందుల కొరతను అధిగమించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తప్పని సరైతేనే ప్రజలు బయటకు రావాలాన్నారు. ఎక్కువ ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story