Prakasam: ప్రకాశం జిల్లా టీడీపీలోకి వలసల జోరు

Prakasam: టీడీపీలో చేరిన ఎరగొండపాలెం వైసీపీ శ్రేణులు

Shashank Gullapelli
Updated on: 1 May 2024 8:30 PM IST
Migration To TDP In Prakasam District
X

Prakasam: ప్రకాశం జిల్లా టీడీపీలోకి వలసల జోరు

Prakasam: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం టీడీపీలో రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన వైసీపీ శ్రేణులు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గూడూరి ఏరీక్షన్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

నియోజకవర్గపరిధిలో ఎమ్మెల్యే అభ్యర్ధి ఎరీక్షన్ బాబు కుమారుడు అజిత్, కుమార్తె డాక్టర్ చెల్సియాలు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ప్రతి ఒక్కరిని పలుకరిస్తూ కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎర్రగొండపాలెంలో టిడిపి జెండా ఎగరవేయడం ఖాయమని ధీమావ్యక్తం చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story