Vijayawada: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి ఆందోళన

Vijayawada Government Hospital: చికిత్సపొందుతూ మృతిచెందిన నందిగామకు చెందిన వ్యక్తి

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 July 2024 1:15 AM IST
Vijayawada government hospital: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి ఆందోళన
X

Vijayawada government hospital: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అర్ధరాత్రి ఆందోళన

Vijayawada Government Hospital: విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఇవాళ్టి నుంచి సమ్మె చేయనున్నారు. విధుల్లో ఉన్న వైద్యులపై రోగి బంధువుల దాడిని ఖండిస్తూ విధులు బహిష్కరించనున్నారు.

తమకు రక్షణ కల్పిస్తేనే విధులకు హాజరవుతామంటూ హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. క్యాజువాలిటీలో సరైన సౌకర్యాలు లేకపోతే తామేం చేస్తామని జూనియర్ డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.

గడ్డిమందు తాగిన వ్యక్తికి చికిత్స చేస్తుండగానే చనిపోవడంతో వైద్యుల నిర్లక్ష్యంగానే చనిపోయాడంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుడి బంధువులు దురుసుగా ప్రవర్తించారు. విధుల్లో ఉన్న డాక్టర్లను దుర్భలాషడారంటూ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story