Michaung Cyclone: దూసుకొస్తున్న మిచౌంగ్ తుఫాను.. నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో కమ్ముకుంటున్న కారు మేఘాలు

Michaung Cyclone: జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు

Jyothi
Published on: 2 Dec 2023 3:29 PM IST
Michaung Cyclone High Alert to AP
X

Michaung Cyclone: దూసుకొస్తున్న మిచౌంగ్ తుఫాను.. నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో కమ్ముకుంటున్న కారు మేఘాలు

Michaung Cyclone: ఏపీకి మిచాన్ తుఫాన్‌ ముప్పు పొంచి ఉంది. నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి.వాకాడు మండలం తూపిలిపాలెం తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తుఫాను హెచ్చరికలతో నెల్లూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భయం గుప్పిట్లో ఉన్న మత్యకారులు పడవలు భద్రపరుచుకుంటున్నారు.

నెల్లూరు కలెక్టరేట్ సహా ఆర్డిఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తీరప్రాంత అధికారులకు సెలవులు రద్దుచేసి.....సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Jyothi

Jyothi

Next Story