Kurnool: రేపు నంద్యాలలో మేమంతా సిద్ధం సభ

Kurnool: బస్సు యాత్రతో నంద్యాల చేరుకోనున్న జగన్

Shashank Gullapelli
Published on: 27 March 2024 6:53 PM IST
Memantha Siddham Sabha In Nandyal Tomorrow
X

Kurnool: రేపు నంద్యాలలో మేమంతా సిద్ధం సభ 

Kurnool: నంద్యాలలో రేపు మేమంతా సిద్ధం సభ నిర్వహించనున్నారు. సభను సక్సెస్ చేసేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేమంతా సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వైసీపీ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, తలసిల రఘురామ్ , ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పరిశీలించారు. సీఎం వైఎస్ జగన్ 28వ తేదీన నంద్యాలకు బస్సుయాత్రగా చేరుకొని మేమంతా సిద్ధం సభలో పాల్గొననున్నారు. రేపు ఆళ్లగడ్డ నుంచి బస్సు యాత్ర బయలుదేరి నంద్యాల పట్టణంలోని నూనెపల్లికు చేరుకుంటారు. అక్కడి నుండి బొమ్మల సత్రం మీదుగా ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజ్ మైదానానికి జగన్ చేరుకుని సభలో ప్రసంగిస్తారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story