రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి సుచరిత

Mekathoti Sucharita: మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్న ఏపీ మాజీ హోంమంత్రి సుచరితను సీఎం జగన్‌ బుజ్జగించారు.

Arun Chilukuri
Updated on: 13 April 2022 8:01 PM IST
Mekathoti Sucharita Gives Clarity on Her Resignation
X

రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి సుచరిత

Mekathoti Sucharita: మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్న ఏపీ మాజీ హోంమంత్రి సుచరితను సీఎం జగన్‌ బుజ్జగించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించి ఆమెతో మాట్లాడారు. తన గురించి అనేక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, జడ్పీటీసీ నుంచి హోంమంత్రి స్థాయికి చేరానంటే వైసీపీ చలవేనని స్పష్టం చేశారు. అనారోగ్య, వ్యక్తిగత కారణాలతో కేబినెట్‌లో కొనసాగలేనేమోనని థ్యాంక్స్ చెబుతూ లేఖ రాస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని రకరకాలుగా వార్తలొచ్చాయన్నారు. పదవి ఆశించి రాకపోవడంతో చిన్న ఎమెషన్‌కు గురయ్యానని సుచరిత తెలిపారు. కేబినెట్‌ పునర్‌వ్యవస్థీరణలో సీఎం జగన్‌ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని సుచరిత తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story