సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు.. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం జగన్

CM Jagan: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిది

Rama Rao
Published on: 8 March 2022 12:43 PM IST
Mekapati Goutham Reddy Name for Sangam Barrage in the Assembly Announced by CM Jagan
X

సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు.. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం జగన్

CM Jagan: సంగం బ్యారేజీకి మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం జగన్. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి లేని లోటు పూడ్చలేనిదన్నారు సీఎం జగన్. పార్టీకి, రాష్ట్రానికి తీరని లోటు అని చెప్పారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా రెండోరోజు గౌతమ్‌రెడ్డి మృతిపై ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.

గౌతమ్‌రెడ్డి లేకపోయినా ఆయన కన్న కలలు నెరవేరుస్తామని సీఎం జగన్‌ అన్నారు. వెలిగొండ ప్రాజెక్ట్‌ ద్వారా ఉదయగిరికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. సంగం బ్యారేజీ పనులను 6 వారాల్లో పూర్తి చేస్తామని అన్నారు. సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేరు పెడతామని అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

Rama Rao

Rama Rao

Next Story