కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ మంత్రి మేకపాటి భేటీ

కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్‌, గ్రీన్‌ఫీల్డ్‌ ఇథనాల్‌ రిఫైనరీపై చర్చించారు

Arun Chilukuri
Updated on: 16 Jun 2021 6:19 PM IST
Mekapati Goutham Reddy Meet Dharmendra Pradhan
X

Andhra Pradesh: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ మంత్రి మేకపాటి భేటీ

Andhra Pradesh: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిశారు. కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్‌, గ్రీన్‌ఫీల్డ్‌ ఇథనాల్‌ రిఫైనరీపై చర్చించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జరిపిన చర్చలకు కొనసాగింపుగా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ చర్చలు జరిపారు. వీలైనంత త్వరగా కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్‌ను ప్రారంభించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కోరారు.

పెట్రో కెమికల్ కారిడార్ కింద 32వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు మేకపాటి గౌతమ్ తెలిపారు. అలాగే, విశాఖ స్టీల్ ప్లాంట్‌ అంశంపైనా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో చర్చించినట్లు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story